ప్రభుత్వ దుకాణాలు బార్లా తెరిచి.. మద్యపాన నిషేధం అంటూ సీఎం జగన్ కొత్త నిర్వచనం చెప్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. శానిటైజర్ తాగించి ప్రజలను పొట్టన పెట్టుకోవడం కూడా నిషేధంలో భాగమేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనన్న ఆయన.. బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మద్యం పేరుతో జగన్ సమాంతర మాఫియాను నడుపుతున్నారన్న లోకేశ్.. దీనిపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మద్యం అక్రమాలపై న్యాయవిచారణ జరిపించాలి: లోకేశ్ - lokesh demands on sanitizer deaths in ap latest news
శానిటైజర్ తాగించి ప్రజలను పొట్టన పెట్టుకోవడం కూడా నిషేధంలో భాగమేనా అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. శానిటైజర్ తాగి 30 మంది చనిపోతే సీఎం జగన్కు చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు.
lokesh demands