కృష్ణా జిల్లా మైలవరంలో మద్యం దుకాణాల ముందు.. మందుబాబులు భారీగా బారులు తీరారు. ఉదయం 11 గంటలకు షాపులు ప్రారంభం కావడంతో.. లాక్డౌన్ ఉన్నా పట్టించుకోకుండా.. ముందుగానే దుకాణాల వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం నియమించబడిన నూతన ధరలతో మద్యం ప్రజలకు అందజేస్తున్నామని... క్యూ పద్ధతులు పాటిస్తూ.. ప్రతి మద్యం షాపు వద్ద.. పోలీసు సిబ్బంది సహకారం కూడా తీసుకుంటున్నామని మైలవరం ఎక్సైజ్ ఎస్సై బాలాజీ తెలిపారు. ఎవరైతే లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా ఉంటారో.. వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మద్యం విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలే
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు మద్యం అందచేస్తున్నామని కృష్ణా జిల్లా మైలవరం ఎక్సైజ్ ఎస్సై బాలాజీ తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా మంద్యం కోసం వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
lockdown rules are strictly inmplimented due to wine shops opening in mailavaram in krishna