కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో రేపటి నుంచి లాక్ డౌన్ నిబంధనల అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అధికారులకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఉదయం పది గంటల తర్వాత అనవసరంగా బయటకు రావద్దని.. మన కోసం మన జగ్గయ్యపేట ప్రజల కోసం అందరమూ నిబంధనలు పాటిద్దామని వారు సూచించారు. జగ్గయ్యపేటలో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసే వారు రేపటినుంచి 15 రోజుల పాటు రోడ్ల మీద వ్యాపారాలకు అనుమతి లేదని వారు తెలిపారు. వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పట్టణంలోని వీధులలో అమ్ముకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.
రేపటి నుంచి జగ్గయ్యపేటలో లాక్ డౌన్ - కృష్ణా జిల్లా
రేపటి నుంచి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
రేపటి నుంచి జగ్గయ్యపేటలో లాక్ డౌన్