కేంద్రానికి వ్యతిరేకంగా ఈనెల 26, 27న చేపట్టనున్న జాతీయ సమ్మెకు కులవివక్ష పోరాట సమితి నాయకులు మద్దతు తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా కీలక రంగాలను ప్రైవేటీకరణ చేసే దిశగా చర్యలు చేపడుతున్నారని వామపక్ష పార్టీ నాయకులు శ్రీనివాసరావు అన్నారు. అదే జరిగితే రిజర్వేషన్లు కోల్పోయి ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని తెలిపారు. రాజ్యంగంలో కల్పించిన హక్కులను కాలరాసి, మను వాదాన్ని తెరమీదకు తీసుకువస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ రక్షణ, గిరిజనులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణకై ప్రజలు సమ్మెలో పాల్గొనాలని కోరారు.
చిత్తూరులో...