కృష్ణా జిల్లా కోడూరు మండలంలో లేఅవుట్ల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. కోడూరు, వి.కొత్తపాలెంలో ప్రభుత్వ భూమిలో రైతులు పంటలు పండించుకోవద్దని అధికారులు సూచించారు. అయినప్పటికీ అపరాల సాగు చేపట్టడంతో అధికారులు వాటిని తొలగించారు. పేదలకు ఇళ్ల పట్టాలను అందించేందుకు తహశీల్దార్ చేస్తున్న పనిలో నిబద్ధత ఉన్నప్పటికీ పంటను కోల్పోతున్న రైతులు.. రెవెన్యూ అధికారుల చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వేగవంతంగా లే అవుట్ల ప్రక్రియ
కృష్ణా జిల్లాలో ఉగాది నాటికి పేదలందరికీ 'ఇళ్ల పట్టాల పంపిణీ' కార్యక్రమంలో భాగంగా లేఅవుట్ల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.
వేగవంతంగా లే అవుట్ల ప్రక్రియ