ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 26, 2021, 3:46 PM IST

ETV Bharat / state

పెట్రోలు, డీజిల్​ ధరలు తగ్గించాలని లారీ, ట్యాక్సీ కార్మిక సంఘాల నిరసన

దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్‌ బంద్‌కు మద్దతుగా బెజవాడ బెంజి సర్కిల్‌లో లారీ, ట్యాక్సీ వర్కర్స్‌ యూనియన్లు ధర్నా చేపట్టాయి. పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు.

Larry, taxi unions protest at vijayawada
లారీ, ట్యాక్సీ కార్మిక సంఘాల నిరసన

దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్‌ బంద్‌కు మద్దతుగా విజయవాడ బెంజిసర్కిల్‌లో లారీ, ట్యాక్సీ కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలంటూ పలువురు ఆందోళనకు దిగారు. దేశ ప్రగతిలో రవాణా రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ 30 రూపాయలు మాత్రమే ఉంటే.. ట్యాక్స్‌ల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింతలు చేశాయని మండిపడ్డారు. కరోనాతో రవాణా రంగం పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపారు.

లారీ, ట్యాక్సీ కార్మిక సంఘాల నిరసన

గడువు అయిపోయిన టోల్‌ ప్లాజ్‌లను వెంటనే ఎత్తివేయాలని, పెంచిన టోల్‌ ట్యాక్స్‌లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు పెరుగుతున్న డీజిల్‌, పెట్రోల్‌తో రవాణా రంగం పూర్తిగా కుదేలవుతుందని ఈశ్వరరావు పేర్కొన్నారు

ఇదీ చూడండి.పాత నోటిఫికేషన్​ ప్రకారమే ఎన్నికలు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details