ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యను చంపి... కనిపించడం లేదంటూ భర్త ఫిర్యాదు

భర్తే కాలయముడిగా మారి భార్యను హతమార్చాడు. అనంతరం ఏమి తెలియనట్లు పోలీస్ స్టేషన్​కి వెళ్లి తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. అతని ప్రవర్తనను అనుమానించిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా భార్యను చంపినట్లు అంగీకరించాడు.

శిరీష

By

Published : Jul 7, 2019, 11:33 PM IST

వీడిన మిస్సింగ్ కేసు మిస్టరీ

విజయవాడలో వివాహిత శిరీష అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. గన్నవరం మండలం కేసరపల్లి పంటకాల్వ తూములో ఆమె మృతదేహం లభ్యమైంది. వారం రోజుల క్రితం చిన్నఅవుటపల్లిలో ఆసుపత్రికి వచ్చిన శిరీష... అదృశ్యమైంది. ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన భర్త శివనాగరాజుపై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టారు. భార్యను తానే రాడ్‌తో కొట్టి చంపానని అతను ఒప్పుకున్నాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details