కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, కొలుసు పార్థసారథి, ఇతర నేతలు పాల్గొన్నారు. తొలుత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నేతలు.. నూతన కమిటీతో ప్రమాణం చేయించారు.
రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ కమిటీలకు ప్రత్యేక అధికారాలు ఇచ్చి రైతులకు నిరంతరం సేవలు అందేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కమిటీ సభ్యులు రైతులకు అండగా ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా కృషి చేయాలని నేతలు సూచించారు.