ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల తొలగింపు.. అవాస్తవం' - ఏపీ నోడల్ అధికారి కృష్ణబాబు వార్తలు

రేపటి నుంచి రాష్ట్రంలో సరిహద్దు చెక్‌పోస్టులను తొలగిస్తున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోకి రావాలంటే స్పందన వెబ్‌సైట్‌లో తప్పక నమోదు చేసుకోవాలని సూచించింది. రాష్ట్రంలోకి వచ్చేవారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. 6 రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లు వారం పాటు... క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

KRISHNABABU
KRISHNABABU

By

Published : Jun 7, 2020, 7:12 PM IST

రాష్ట్రంలో సరిహద్దు చెక్‌పోస్టులు తొలగింపు వార్తలు అవాస్తవం అని ప్రభుత్వం ప్రకటించింది. చెక్‌పోస్టులను తొలగించే నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదని స్పష్టం చేసింది. కొవిడ్ ఆర్డర్ 55 ప్రకారం చెక్‌పోస్టులు నిర్వహిస్తున్నట్లు ఏపీ నోడల్ అధికారి కృష్ణబాబు తెలిపారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ప్రవేశాలు కొన్నిరోజులు నియంత్రిస్తామని చెప్పారు.

రాష్ట్రంలోకి రావాలంటే స్పందన వెబ్‌సైట్‌లో తప్పక నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోకి వచ్చేవారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 6 రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లు వారం పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణకు బస్సులు నడిపేందుకు ఆ రాష్ట్రం ఇంకా అనుమతి ఇవ్వలేదని కృష్ణబాబు వెల్లడించారు. అనుమతి ఇచ్చాక హైదరాబాద్ నుంచి బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details