అమెరికా నుంచి సొంతూరికి వచ్చిన యువకుడికి కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నెల 9న అమెరికా నుంచి కృష్ణా జిల్లాలోని సొంతూరికి వచ్చిన యువకుడికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 14 రోజులపాటు స్వీయ క్వారంటైన్లో ఉండాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. ఎల్లుండి జరగాల్సిన పెళ్లిని వాయిదా వేసుకోవాలని యువకుడికి సూచించారు. వివాహ వేడుకల సన్నద్ధతపై పోలీసుల అభ్యంతరం వ్యక్తం చేశారు.
కృష్ణావాసికి కరోనా కష్టం...పెళ్లి వాయిదాకి పోలీసుల నోటీసులు
వివాహం కోసం అమెరికా నుంచి కృష్ణాజిల్లాలోని సొంతూరికి వచ్చిన యువకుడికి కరోనా కష్టం వెంటాడుతోంది. శుక్రవారం జరగాల్సిన వివాహాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు నోటీసులిచ్చారు.
పెళ్లి వాయిదాకి పోలీసు నోటీసులు