ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రసాయన కర్మాగారాల్లో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

రసాయన కర్మాగారాల వ్యర్థాల కారణంగా.. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయన్న ఫిర్యాదుపై కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ స్పందించారు. స్వయంగా.. కర్మాగారాలు పరిశీలించి ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు.

By

Published : Jul 18, 2019, 4:40 AM IST

sub collector meesha singh

రసాయన కర్మాగారాల్లో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలోని పారిశ్రామికవాడలో ఉన్న రసాయన కర్మాగారాలను... సబ్ కలెక్టర్ మీషా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రసాయన కర్మాగారాలు వదిలే వ్యర్ధాల కారణంగా.. భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయని కొందరు చేసిన ఫిర్యాదు మేరకు స్వయంగా రంగంలోకి దిగారు. కర్మాగారాల్లో నీళ్ల నమూనాలు సేకరించారు. తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపి వేయాలని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. తదుపరి నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. టైర్ల నుంచి నూనె తీసే కర్మాగారం మూసివేయాలని ఆదేశించారు. ఎమ్మార్వో , మునిసిపల్ కమిషనర్, ఎండీవోలతో పాటు స్థానిక నాయకులు వివిధ పార్టీల ప్రతినిధులు, కర్మాగారాల యజమానులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details