కృష్ణా జిల్లాలో నివర్ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నామని, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు పాటిస్తామని తెలిపారు. చల్లపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అధికారులతో సమీక్ష జరిపారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆరా తీశారు.
'తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం' - కృష్ణాజిల్లాలో పోలీసు సిబ్బంది రక్షణ చర్యలు
కృష్ణా జిల్లాలో జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, తుపాను ప్రభావం వంటి ప్రధాన అంశాలపై ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సమీక్ష జరిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన అంబేడ్కర్‌కు నివాళి అర్పించారు.
ఎస్పీ రవీంద్రనాధ్ బాబు