కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత తగ్గడం లేదు. బుధవారం మరో 14 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు సంఖ్య 300కు చేరింది. మార్చి 21వ తేదీన ఫ్రాన్స్ నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకునిలో కరోనా వైరస్ మొదటిసారి బయటపడింది. ఆ తర్వాత మార్చి నెలాఖరు వరకు మొత్తం ఆరు కేసులే నమోదయ్యాయి. ఏప్రిల్ 24వ తేదీకి జిల్లాలో వంద కేసులు దాటాయి. ఏప్రిల్ 27వ తేదీ నాటికి 200కు చేరింది.
విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తుల నిర్లక్ష్యం, అవగాహన లేమి కారణంగా పాటిజిటివ్ కేసుల సంఖ్య వేగంగా 200లు దాటింది. అప్పటి నుంచి విజయవాడ నగరంలో వైరస్ సామాజిక వ్యాప్తి ఆరంభమైంది. కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది. అందువల్లే మరో వంద కేసులు ఎనిమిది రోజుల్లో నమోదయ్యాయి. వీటిలోనూ ఎక్కువ కేసులు విజయవాడలోనే ఉన్నాయి.