విజయవాడ నగర శివారు పాయకాపురం రైతు బజారును కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పని పాటించాలని అక్కడి వారికి సూచించారు. రెండవ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా 150 కేంద్రాలు ఏర్పాటు చేసి యుద్ద ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని చెప్పారు. మే 1 నుంచి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్‌కు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
'రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం'
రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నామని కృష్ణాజిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ తెలిపారు. వ్యాక్సిన్‌పై అపోహలు తొలగిపోయి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు.
పండ్ల మార్కెట్‌ను తనిఖీ చేస్తున్న కలెక్టర్