కృష్ణా జిల్లాలో జులై 31 నాటికి 6 వేల 200 కరోనా కేసులు నమోదైనట్లు కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 60 ఏళ్లకు పైబడి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులకు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వారితో పాటు పారిశుద్ధ్య కార్మికులు, వీధి వ్యాపారులు, పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు.
అనుమానితులు కరోనా పరీక్షలు చేయించుకోవాలి: కలెక్టర్ - కరోనా వైరస్ అనుమానితులు పరీక్షలు చేయించుకోవాలి
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు 6 వేల 200 కేసులు నమోదయ్యాయని.., వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
కరోనా వైరస్ అనుమానితులు పరీక్షలు చేయించుకోవాలి: కలెక్టర్