రెండు రోజుల విరామం అనంతరం విజయవాడలో కొవిడ్ టీకా రెండో డోసు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఈ ప్రక్రియలో సిబ్బందికి పలు అవాంతరాలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రెండో డోసు టీకా వేయాలంటే మొదటి డోసులో నమోదు చేసిన చరవాణి సంఖ్య ఉండాలన్న నిబంధనతో కొందరు వృద్ధులు వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొందని పటమట వ్యాక్సినేషన్ కేంద్రం నోడల్ అధికారి డా.శ్రీదేవి అన్నారు. వృద్ధులకు, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లు ఉన్న వారికి, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వేర్వేరుగా టోకెన్లు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
విజయవాడలో ప్రారంభమైన కొవిడ్ రెండో డోస్ వ్యాక్సినేషన్ - విజయవాడలో కరోనా టీకా ప్రక్రియ
విరామం అనంతరం విజయవాడలో కరోనా టీకా రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పటమట వ్యాక్సినేషన్ కేంద్రం నోడల్ అధికారి డా.శ్రీదేవి అన్నారు.
విజయవాడలో తిరిగి ప్రారంభమైన కొవిడ్ రెండో డోస్ వ్యాక్సినేషన్