ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

rahul murder case: కోగంటి సత్యంకు 14 రోజుల రిమాండ్​ - రాహుల్ హత్య కేసు తాజా వార్తలు

rahul murder case
rahul murder case

By

Published : Aug 24, 2021, 9:09 AM IST

Updated : Aug 24, 2021, 5:35 PM IST

09:06 August 24

Koganti Satyam was produced in a Bangalore court

రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న కోగంటి సత్యంను పోలీసులు విజయవాడలోని ఒకటో అదనపు చీఫ్‌ మెట్రో పాలిటన్‌ కోర్టులో హాజరుపరచగా.. 14రోజుల రిమాండ్​ విధించింది. అనంతరం ఆయనను మచిలీపట్నం జైలుకు తరలించారు. 

నిన్న కోగంటి సత్యంను నిన్న (సోమవారం) బెంగళూరులో అరెస్ట్​ చేసి.. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు. ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. 

రాహుల్ హత్య.. ఆ రోజు ఏం జరిగింది?

విజయవాడ నడిబొడ్డున కారులో గురువారం మృతదేహం కలకలం సృష్టించింది. హతుడు.. పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ (29) అని దర్యాప్తులో తేలింది. వ్యాపార వాటాల్లో వివాదమే ఇందుకు కారణమని, వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో నలుగురు నిందితుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వీరిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. మృతుడి తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కెనడాలో చదివిన కరణం రాహుల్‌.. స్వదేశానికి వచ్చాక కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన చేశారు. పోరంకిలో వారు నివాసం ఉంటున్నారు. అత్యవసరంగా మాట్లాడాలని ఫోన్‌ రాగా బుధవారం రాత్రి 7.30 సమయంలో రాహుల్‌ కారులో బయటకు వచ్చారు.

 రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోవారు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వచ్చింది. తెల్లవారిన తర్వాతా ఇంటికి రాకపోయేసరికి, రాహుల్‌ తండ్రి రాఘవ.. పెనమలూరు పోలీసులకు చెప్పారు. ఇంతలో వైర్‌లెస్‌ సెట్లో మొగల్రాజపురంలో కారులో మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. మృతుడు రాహుల్‌ అని అతడి తండ్రి గుర్తించి, బోరున విలపించారు.

ఇదీ చదవండి:

RAHUL MURDER CASE:నా కుమారుడి హత్యలో వారికి భాగం: రాహుల్ తండ్రి రాఘవరావు

Last Updated : Aug 24, 2021, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details