ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరం: కేశినేని

రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ చంద్రాబాబే ముఖ్యమంత్రి కావాలని తెదేపా నేత కేశినేని నాని అన్నారు. జగన్ లాంటి దొంగ చేతికి తాళాలివ్వవద్దని ప్రజలను కోరారు.

కేశినేని నాని మీడియా సమావేశం

By

Published : Apr 9, 2019, 1:44 PM IST

కేశినేని నాని మీడియా సమావేశం

వైకాపా అధ్యక్షుడు జగన్​పై 31 కేసులు ఉన్నాయనీ.. అలాంటి వ్యక్తి సీఎం కావాలని కలలు కంటున్నారని తెదేపా నేత కేశినేని నాని విమర్శించారు. 25 మంది వైకాపా ఎంపీ అభ్యర్థుల్లో 12 మందిపై కేసులున్నాయని గుర్తు చేశారు. దొంగలు, కుంభకోణాలు చేసిన వ్యక్తులు ప్రతిపక్షం నుంచి పోటీచేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ప్రధాని మోదీ మోసం చేశారనీ... ఎన్ని ఇబ్బందులున్నా చంద్రబాబు ఏపీని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details