నాలుగున్నరేళ్లుగా మోదీ సర్కార్ మోసం చేస్తోంది: ఎంపీ నాని - mp
కృష్ణాజిల్లా తిరువూరులో పసుపు- కుంకుమ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లోనూ రాష్ట్రానికి కనీస ప్రయోజనాలు అందించకుండా మోసం చేసిందని ఆరోపించారు.
కేశినేని నాని
నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీ సర్కార్.. కేంద్ర బడ్జెట్లోనూ కనీస ప్రయోజనాలు అందించకుండా మోసం చేసిందని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో పసుపు-కుంకుమ కార్యక్రమానికి హాజరైన ఆయన.. కేంద్ర ప్రభుత్వం ఏపీపై వివక్ష చూపిందని మండిపడ్డారు. ఎన్ని సమస్యలొచ్చిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ తెదేపాకు మద్దతివ్వాలని కోరారు.
కేశినేని నాని