కృష్ణా జిల్లా నూజివీడులో దారుణం జరిగింది. ఓ కసాయి కొడుకు కన్నతల్లిపై కత్తితో దారుణంగా దాడి చేశాడు. బాపునగర్ ప్రాంతానికి చెందిన పల్లె రాంబాబు, సుజాత దంపతులు దినసరి కూలీలు. వారి కుమారుడు రోహిత్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. కుటుంబ కలహాలతో తల్లి సుజాత గొంతుకోశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న ఘటనపై విచారిస్తున్నారు.
కన్నతల్లి గొంతు కోసిన కిరాతక కొడుకు ! - కన్నతల్లి గొంతు కోసిన కసాయి కొడుకు
కనికరం లేని కన్నకొడుకు జన్మనిచ్చిన తల్లి గొంతు కోసిన దారుణ ఘటన కృష్ణాజిల్లా నూజివీడులో చోటు చేసుకుంది. ఆమెను ఆసుపత్రికి తరలించగా..నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కన్నతల్లి గొంతు కోసిన కిరాతక కొడుకు