కరోనా నియంత్రణ ప్రభుత్వ ఎజెండాలో లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ నిరక్ష్యం ప్రజల నిండు ప్రాణాలు తీస్తోందని ఆయన మండిపడ్డారు. కరోనా వైరస్ సాధారణ జ్వరంలాంటిదే అయితే.. వైకాపా నేతలు వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు ఎందుకెళ్తున్నారని నిలదీశారు.
వేల సంఖ్యలో కేసులు పెరిగిపోతూ మరణ మృదంగం మోగుతుంటే పాలకులకు కనిపించడం లేదా?. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. వైద్య ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామన్నారు. కానీ అది ఎక్కడా అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామన్నారు. అదీ అమలుకాలేదు. ఇప్పటికైనా జగన్ సంకుచిత రాజకీయాలు మాని కరోనా కట్టడి చర్యలు చేపట్టాలి. లేకుంటే శవాల దిబ్బలపై రాజ్యం ఏలాల్సి వస్తుందని గుర్తించాలి. - కళా వెంకట్రావు