'కానుమోలు ఆక్వాఫీడ్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన' - aqua
కృష్ణాజిల్లా కానుమోలులోని ఆక్వాఫీడ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు, పొగతో అనారోగ్యానికి గురవుతున్నామంటూ... కాకుపాడు వాసులు పరిశ్రమ ముందు ఆందోళన నిర్వహించారు
'కానుమోలు ఆక్వాఫీడ్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన'
కృష్ణాజిల్లా కానుమోలులోని గోద్రెజ్ ఆక్వాఫీడ్ ఫ్యాక్టరీ వద్ద కాకులపాడు గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్ధాలతో తమ గ్రామంలో పలువురు శ్వాసకోశ వ్యాధులతో అనారోగ్యానికి గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు...లేని పక్షంలో ఆందోనళనలు తీవ్రతరం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.