ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత

జూనియర్ డాక్టర్లంతా కలిసి విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికోలకు పోలీసులకు మధ్య స్వల్ప సంఘర్షణ జరిగినా పట్టు వదలని విక్రమార్కులులా చట్ట సవరణ జరగాలంటూ నిరసన తెలుపుతున్నారు. నిరసన చేస్తున్న జూడాలపై పోలీసులు లాఠీ జులిపించారు. ఈ ఘటనలో డీసీపీ హర్షవర్ధన్ ఓ జూనియర్ డాక్టర్ చెంపపై కొట్టారు. ఆగ్రహించిన జూడాలు డీజీపీ సవాంగ్ ఫిర్యాదు చేశారు.

మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత

By

Published : Aug 7, 2019, 1:37 PM IST

Updated : Aug 7, 2019, 7:03 PM IST

'మెడికో... పట్టు వదలకోయ్'...!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడ ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లపై పోలీసులు అనుసరించిన తీరుకు వ్యతిరేకంగా జూడాలు ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. ఒక జూనియర్ డాక్టర్‌ కాలర్ పట్టుకుని డీసీపీ చెంపపై కొట్టడమేంటనీ ఆగ్రహించారు. సుమారు 50 మంది జూడాలను అరెస్ట్ చేయడంతో పాటు తమపై దౌర్జన్యంగా ప్రవర్తించారని డీసీపీ తీరుపై డీజీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయడంతో పాటు చేయి చేసుకున్న డాక్టర్​కి క్షమాపణ చెప్పాలంటూ సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో విధులు బహిష్కరించి మరీ మెడికోలు ఆందోళన చేస్తున్నారు. డీసీపీ హర్షవర్ధన్ తీరుపై డీజీపీ గౌతం సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని సవాంగ్ ఆదేశించారు.

జాతీయ మెడికల్ కమిషన్​కు బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. అత్యవసర వైద్య సేవలను నిలిపివేసి ఆందోళన చేశారు. ర్యాలీగా బయలుదేరి ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొద్దిసేపు ట్రాఫిక్ జామ్​ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు జూనియర్ డాక్టర్లతో చర్చించే సమయంలో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఓ మెడికో గల్లా పట్టుకున్న పోలీసు తీరుతో.. కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చివరకు వాహనాదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్​ను క్లియర్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులంతా గురువారం ఉదయం 6 గంటల నుంచి 9వ తేది (శుక్రవారం) ఉదయం ఆరు గంటల వరకు వైద్య సేవలను నిలిపివేస్తామని చెప్పారు. ఎన్ఎంసీ బిల్లులోని చట్ట సవరణలు తెచ్చేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.

మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత

ఇదీ చూడండి:కేంద్ర మాజీ మంత్రి 'సుష్మా స్వరాజ్'​ అస్తమయం

Last Updated : Aug 7, 2019, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details