కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో వరద నష్టాన్ని జాయింట్ కలెక్టర్ మాధవి లత పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. డిసెంబర్ 15లోగా నష్ట పరిహారం అంచనా వేసి నెలాఖరులోగా సబ్సిడీ అందించాలని సీఎం జగన్ ఆదేశించారని వెల్లడించారు. పాయింట్ల వారిగా తేమ శాతాన్ని పరిశీలించి రైతుల నుంచి ధాన్యం సేకరించాలని మిల్లర్లను ఆదేశించామని ఆమె తెలిపారు. మిల్లర్లు కూడా సహకరించాలని కోరారు.
వరద నష్టాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మాధవి లత - కంకిపాడులో వరద నష్టాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్
రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవి లత అన్నారు. డిసెంబర్ 15లోగా నష్ట పారిహారం అంచనా వేసి నెలాఖరులోగా సబ్సిడీ అందించాలని సీఎం జగన్ ఆదేశించారని ఆమె తెలిపారు.
వరద నష్టాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మాధవి లత