పేదల ఇళ్ల స్థలాలలను పరిశీలించిన జేసీ మాధవీలత - పేదల ఇళ్ల స్థలాలలు
జులై 8న పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తామని కృష్ణా జిల్లా జేసీ మాధవీలత స్పష్టం చేశారు. అందుకనుగుణంగా ఇళ్లస్థలాల లే అవుట్లు, ఇతర అభివృద్ధి పనులను పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
విజయవాడ రూరల్ మండలంలోని నున్న గ్రామంలో విజయవాడ గ్రామీణ పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలను జేసి మాధవీలత పరిశీలించారు. విజయవాడ గ్రామీణ మండలంలోని 1,500 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు 151.78 ఎకరాలు గుర్తించామని జేసీ తెలిపారు. అర్హులైన పేదలకు జూలై 8న ఇళ్లస్థలాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఈ మేరకు ఇళ్లస్థలాల లే అవుట్లు, ఇతర అభివృద్ధి పనులను పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కృష్ణా జిల్లాలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు 1,477 లేఅవుట్లను అభివృద్ధి చేశామన్నారు.