Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడలో అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి జనసేన శ్రేణులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించగా.. తామేం నేరం చేశామంటూ కార్యకర్తలు ఎదురు తిరిగారు. చేసేదేమీలేక పోలీసులు వదిలేశారు. గోతులమయంగా ఉన్న కొడాలి నాని ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిలో జనసేన కార్యకర్తలు ధర్నా చేశారు. మొద్దు నిద్రపోతున్న సీఎం మేలుకోవాలంటూ నినాదాలు చేశారు. వారిని నాని ఇంటికి వెళ్లకుండా పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు.
కొడాలి నాని ఇంటి ముట్టడికి జనసేన శ్రేణుల యత్నం
Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడలో అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి జనసేన శ్రేణులు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవటంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది.
కొడాలి నాని ఇంటి ముట్టడికి జనసేన శ్రేణుల యత్నం
TAGGED:
ap latest news