Jana Sena TDP joint action : తెలుగుదేశం నేతలతో జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని జనసేన నిర్ణయించింది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ మేరకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 29 నుంచి మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ఎక్కడికక్కడ ఉమ్మడి పోరాట కార్యాచరణ ఖరారు చేయాలని సూచించారు. పొత్తుని విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీ పన్నే ఉచ్చులో పడొద్దని జనసేన నేతలకు నాదెండ్ల సూచించారు.
TDP Janasena Alliance First Meeting: టీడీపీ-జనసేన 'కీ'లక భేటీ.. విజయమే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణ..!
రాజమండ్రిలో జరిగినజనసేన - టీడీపీ (TDP - Janasena)సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయటంలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర స్థాయిలో పొత్తును క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు 29, 30, 31 తేదీల్లో జిల్లా స్థాయిలో ఇరు పార్టీల సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రాష్ట్ర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, జిల్లా అధ్యక్షులతో ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా స్థాయి జనసేన – టీడీపీ సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సమన్వయ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. సుహృద్భావ వాతావరణంలో సమావేశాలు జరగాలన్నారు. భవిష్యత్తు ప్రజా పోరాటాలు, ఆందోళనల్లో కలసికట్టుగా ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
TDP-JanaSena Coordination Committee: జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో టీడీపీ కమిటీ ఏర్పాటు..