ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

65వ నంబరు జాతీయ రహదారిపై ప్రమాద నివారణ చర్యలు - కృష్ణా తాజా వార్తలు

అత్యంత ప్రమాదకరంగా మారిన 65వ నంబరు జాతీయ రహదారిపై జగ్గయ్యపేట సర్కిల్ పోలీసులు ప్రమాద నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రమాదకర కూడళ్లలో రేడియం స్టిక్కరింగ్ చేసిన డ్రమ్ములు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటివల్ల రాత్రి వేళలో వాహనాలు కూడలి వద్ద నెమ్మదిగా వెళ్లేలా వీలు అవుతుందని పోలీసులు తెలిపారు.

prevention measures on National Highway 65
65వ నంబరు జాతీయ రహదారిపై ప్రమాద నివారణ చర్యలు

By

Published : Nov 15, 2020, 11:41 AM IST

ప్రమాదకరంగా మారిన 65వ నంబరు జాతీయ రహదారిపై కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సర్కిల్ పోలీసులు ప్రమాద నివారణ చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ నుంచి నందిగామ వరకు 40 కిలోమీటర్ల పరిధిలో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. రహదారిలో 8 ప్రాంతాలను అత్యంత ప్రమాదకర బ్లాక్ స్పాట్ గా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో జాతీయ రహదారి కి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రహదారులు అనుసంధానంగా ఉండటం వల్ల అనునిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇక్కడ ప్రమాదాల నివారణకు డీఎస్పీ రమణ మూర్తి ఆదేశాల మేరకు సీఐ చంద్రశేఖర్, ఇతర పోలీస్​ సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రమాదకర కూడళ్లలో రేడియం స్టిక్కరింగ్ చేసిన డ్రమ్ములు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటివల్ల రాత్రి వేళలో వాహనాలు కూడలి వద్ద నెమ్మదిగా వెళ్లేలా వీలు అవుతుందని పోలీసులు తెలిపారు. దీనివల్ల ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details