ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

‌ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు 905 కోట్ల బకాయిలు చెల్లింపు - ఏపీలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల తాజా వార్తలు

రాష్ట్రంలోని పరిశ్రమల పరిపుష్ఠి కోసం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు 905 కోట్ల బకాయిలు చెల్లించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.

పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి
పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి

By

Published : May 17, 2020, 2:13 PM IST

రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 905 కోట్ల ప్రోత్సాహక బకాయిలను చెల్లించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. వీటికి విద్యుత్‌ డిమాండ్ ఛార్జీల కింద 188 కోట్ల రూపాయలను మాఫీ చేసినట్లు వెల్లడించారు. 'బియాండ్ లాక్ డౌన్' పేరిట అసోఛామ్ నిర్వహించిన వెబినార్ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంత్రి హాజరయ్యారు. పరిశ్రమల ఆర్థిక పరిపుష్ఠి కోసం బ్యాంకు గ్యారంటీ ద్వారా సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకుని 200కోట్లు పెట్టుబడి సాయం అందించే ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ వెబినార్‌లో హర్యానా ఉపముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాల, ఒడిశా విద్యుత్ శాఖ మంత్రి శంకర్ మిశ్రా, హర్యానా, తెలంగాణ, అసోం రాష్ట్ర పరిశ్రమల కార్యదర్శులతో పాటు అసోఛామ్ ప్రతినిధులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details