ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దివిసీమకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్

కృష్ణా జిల్లా మోపిదేవి వార్పు వద్ద దివిసీమకు సాగునీటిని ఎమ్మెల్యే రమేశ్ బాబు అధికారులతో కలిసి విడుదల చేశారు. గతేడాది కన్నా ముందుగానే నీరిస్తున్నామని.. రైతులు సాగు పనులు మొదలుపెట్టాలని ఎమ్మెల్యే సూచించారు.

irrigation water released to diviseema in krishna district
దివిసీమకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్

By

Published : Jul 5, 2020, 3:38 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి వార్పు వద్ద దివిసీమకు సాగునీరు విడుదల చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతేడాది కన్నా 8 రోజుల ముందుగానే నీరిచ్చామని తెలిపారు. గతేడాది నీరు ఆలస్యంగా వదలడం వల్ల సాగు పనులు ఆలస్యమయ్యాయని.. దీనివల్ల రైతులు రెండో పంట వేయలేకపోయారని అన్నారు. ఈ ఏడాది ముందుగానే వదలడం వల్ల సకాలంలో సాగు చేసుకోవాలని సూచించారు.

జిల్లావ్యాప్తంగా గత ఏడాది 7.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు ఇరిగేషన్ ఈఈ స్వరూప్​కుమార్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది 80 రోజులపాటు 800 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలినట్టు చెప్పారు. పోయిన సంవత్సరం పూర్తి స్థాయిలో 59 చెరువులను నింపడం వల్ల ఈ సంవత్సరం వేసవిలో అవనిగడ్డ నియోజక వర్గంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details