ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థి ప్రాణం తీసిన చాక్లెట్!

అమ్మా ఎలా ఉన్నావంటూ పలకరించిన ఆ గొంతు మూగబోయింది.. ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ అవ్వాలనుకున్న కలలు చెదిరిపోయాయి. బయటకెళ్లి గంటలో వస్తానంటూ కళాశాల హాస్టల్‌ నుంచి బయటికొచ్చి శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలిపోయాడు. తెలంగాణ హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం డీమార్ట్‌ వద్ద ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో ఇంటర్‌ విద్యార్థి సతీష్‌ నాయక్‌ మృతి చెందటం నగరంలో సంచలనం సృష్టించింది.

Inter student died under suspicious condition at D-Mart store in Telangana
తెలంగాణ వనస్థలిపురం డీమార్ట్ వద్ద విద్యార్థి మృతి

By

Published : Feb 18, 2020, 7:17 AM IST

Updated : Feb 18, 2020, 12:41 PM IST

తెలంగాణ సూర్యాపేట జిల్లా జగ్గుతండాకు చెందిన బాలాజీ, నాగమణి దంపతుల పెద్ద కుమారుడు సతీష్‌ నాయక్‌ హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడం వల్ల సాయంత్రం 5.45 గంటలకు గంటసేపు అనుమతి తీసుకుని కళాశాల హాస్టల్‌ నుంచి బయటికొచ్చాడు. రాత్రి 9.30 గంటలకు అతడు తిరిగి రాలేదంటూ కళాశాల వార్డెన్‌ విద్యార్థి తండ్రి బాలాజీకి ఫోన్‌ చేశాడు. కంగారుపడిన బాలాజీ నగరంలో ఉంటున్న బంధువులను కళాశాల దగ్గరికి పంపించాడు. స్నేహితులను ఆరా తీస్తే సతీష్‌ ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసింది.

డీమార్టు వద్ద ఏం జరిగిందంటే..?

  1. హాస్టల్‌ నుంచి బయటకెళ్లిన సతీష్‌, అతని స్నేహితులు శరణ్‌, మాధవ, కార్తీక్‌ వనస్థలిపురంలోని డీమార్టు దగ్గర కలుసుకున్నారు.
  2. రాత్రి 8.49 నిమిషాలకు డీమార్టు లోపలికెళ్లారు. 8.55 నిమిషాలకు సతీష్‌ బయటికొచ్చాడు. వస్తూ రూ.10 చాక్లెట్‌ను జేబులో వేసుకున్నట్లు అక్కడి సిబ్బంది గుర్తించారని అతడి మిత్రులకు అర్థమైంది. ‘
  3. అదే విషయాన్ని చెప్పేందుకు మేం హడావుడిగా బయటికొచ్చామని.. అది చెప్పేలోపే వెనుక నుంచి భద్రతా సిబ్బంది వస్తుండటాన్ని గమనించి సతీష్‌ తన జేబులోని చాక్లెట్‌ను కింద పడేశాడని అతడి మిత్రులు వెల్లడించారు.
  4. సిబ్బంది తనిఖీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా సతీష్ కుప్పకూలినట్లు వాపోయారు. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లామని.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని వివరించారు.

సీసీ కెమెరాల్లో దాగిన.. నిజాలు

సతీష్‌ చాక్లెట్‌ తీసుకోవడం, బిల్లింగ్‌ కౌంటర్‌ నుంచి పరుగెడుతూ డీమార్టు బయటనున్న చెట్టు పక్కకు వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

కుటుంబ సభ్యులు ఆందోళన

‘నా కుమారుడికి చాక్లెట్‌ దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. చదువు కోసం రూ.లక్షలు ధారపోస్తే.. మాకు శవాన్ని అప్పగించారు' సతీష్‌ తండ్రి బాలాజీ

డీమార్టు సిబ్బంది కొట్టడం వల్లే సతీష్‌ చనిపోయాడంటూ స్టోర్‌ ఎదుట సతీష్‌ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. లంబాడి ఐక్య వేదిక, అఖిల భారతీయ బంజారా సేన నాయకులు వారికి మద్దతు పలికారు. అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. అనంతరం హయత్‌నగర్‌లో సతీష్‌ చదువుతున్న కళాశాలకు వద్ద ఆందోళన చేశారు.

ఇవీ చూడండి:

'3 రాజధానులు... రాష్ట్రానికి మరణ శాసనమే'

Last Updated : Feb 18, 2020, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details