మీడియాతో ఎంపీ కేశినేని నాని ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావునుబదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏకపక్షం అని విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థి కేసినేని నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండో పక్షాన్నీ విచారించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్ ఆడుతున్న నాటకంలో ఇది భాగమని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ తో కలిసి కేసినేని నాని 10వ డివిజన్ అయ్యప్ప నగర్ లో పర్యటించారు. శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు.