ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా రవాణా అధికారుల తనిఖీలు - రవాణా వాహనాలకు ఫిట్నెస్ పర్మిట్ తప్పనిసరి

కృష్ణా జిల్లా రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రత దృష్ట్యా విస్తృత తనిఖీలు నిర్వహించారు. సొంత వాహనాలతో ప్రయాణికులను చేరవేస్తున్న పది వాహనాలను సీజ్ చేశారు. ఫిట్నెస్ పర్మిట్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.

Inspections by transport officials
రవాణా అధికారులు తనిఖీలు

By

Published : Nov 5, 2020, 6:48 PM IST

కృష్ణా జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందుకు ప్రత్యేకంగా 5 బృందాలను ఏర్పాటు చేశారు. అనధికారంగా ప్రయాణికులను చేరవేస్తూ పట్టుబడిన 10 వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.

రవాణా వాహనాలకు ఫిట్నెస్ పర్మిట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని జిల్లా రవాణా శాఖ ఉపకమిషనర్ (డీటీసీ) పురేంద్ర తెలిపారు. పన్నులు చెల్లించకపోయినా, పర్మిట్లు లేకపోయినా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. రవాణాశాఖ ఆదాయానికి గండి కొడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details