ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రతినిధులతో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి విజయవాడలో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, సింగిల్ విండో విధానం, అనుమతుల జారీ వంటి అంశాలను వివరించారు. వచ్చే ఏడాది నూతన పరిశ్రమల విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని చెప్పారు. ఉపాధి కల్పన దిశగా.. తమ ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు.
'పరిశ్రమల నూతన విధానానికి త్వరలోనే రూపకల్పన' - గౌతమ్ రెడ్డి
రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రోత్సాహం, పెట్టుబడులకు సహకారానికి సంబంధించిన అంశాలపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రతినిధులతో మంత్రి గౌతమ్‌రెడ్డి విజయవాడలో సమావేశమయ్యారు.
ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ