రాష్ట్రంలో అనూహ్యంగా విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. ఖరీఫ్ పనులు ప్రారంభం కావటంతో వినియోగం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పవన, సౌర విద్యుత్పత్తి కూడా ఒక్కసారిగా పడిపోయింది. తగ్గిన ఉత్పత్తి సర్దుబాటు చేయటానికి ప్రత్యామ్నాయంగా థర్మల్, జల విద్యుత్ పై ఆధారపడాల్సి వస్తోంది.
గతేడాదితో పోలిస్తే ...
గతేడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ నెల 16న విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో 181 మిలియన్ యూనిట్లకు చేరింది. గతేడాది ఇదేరోజు 146 మి.యూ.మాత్రమే వినియోగమైంది. పెరిగిన డిమాండ్‌కు సర్దుబాటు చేయడానికి థర్మల్ కేంద్రాలు ద్వారా పూర్తి స్థాయిలో 74 మి.యూ విద్యుదుత్పత్తి చేస్తున్నారు.