ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గుండెనొప్పిని... గ్యాస్​ నొప్పి అనుకోవద్దు' - రమేష్​ హాస్పటల్స్

విజయవాడలోని రమేష్​ హాస్పటల్స్ ఛైర్మన్​ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వెల్సన్స్‌ సిండ్రోమ్‌ అనే గుండె జబ్బు గురించి ఆసక్తికర సమాచారాన్ని తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్​ రమేష్

By

Published : Aug 3, 2019, 3:03 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్​ రమేష్

విజయవాడలోని రమేష్​ హాస్పిటల్స్​లో వెల్సన్స్‌ సిండ్రోమ్‌ అనే గుండె జబ్బుపై సమావేశం నిర్వహించారు. రమేష్ ​హాస్పిటల్స్ ఛైర్మన్​ మాట్లాడుతూ...వెల్సన్స్‌ సిండ్రోమ్‌ అనే గుండెజబ్బును గ్యాస్‌ట్రబుల్​గా భావించి ప్రమాదంలో పడవద్దని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 75 లక్షల మంది మరణిస్తుంటే అందులో 90 శాతం మంది గుండె సమస్యను మొదటి గంటలో గుర్తించక మరణాలకు గురవుతున్నారని తెలియజేశారు. వెల్సన్‌ సిండ్రోమ్‌ వ్యాధికి ఈసీజీలో మార్పులు కనపడవని, ఇటువంటి కేసులను నిపుణులైన వైద్యులు మాత్రమే గుర్తించి సత్వరం వైద్యసహాయం అందించి ప్రాణాలు కాపాడగలరని ఆయన తెలిపారు. 3 రోజుల క్రితం గుండెపోటు వచ్చిన తొలిగంటలో ఆసుపత్రిలో వైద్యసహాయానికి వచ్చిన కృష్ణాజీ అనే పాత్రికేయునికి రక్తనాళాలు 99 శాతం బ్లాక్‌ కావడంతో తక్షణం స్టంట్‌ వేసి ప్రాణాపాయం నుంచి కాపాడినట్లు వైద్యుడు డాక్టర్‌ రమేష్‌ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details