ఆషాడమాసంలో వచ్చే కృతిక నక్షత్రం సందర్భంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాలలో భాగంగా ఆలయ అధికారి లీలా కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వర్తించారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు గోపూజ, సుప్రభాత సేవ, అభిషేక జల సంగ్రహాణము, ఆలయ ప్రదక్షణ, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, సుబ్రహ్మణ్య మూలమంత్ర అనుష్ఠానములు, మహానివేదన నీరాజన మంత్ర పుష్పములు, అభిషేకాలు, ఆలయంలో గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొని పుట్టలో పాలు పోసి మొక్కలు తీర్చుకున్నారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు - కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా అవినిగడ్డ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 3 రోజులపాటు జరిగే ఆషాడమాస పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
పూజలు చేస్తున్న అర్చకులు