అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మైలవరం సీఐ శ్రీను హెచ్చరించారు. కృష్ణా జిల్లా మైలవరంలో అక్రమంగా తెలంగాణ నుంచి తరలిస్తున్న 612 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... 3 స్కూటీలను సీజ్ చేసినట్లు ఆయన వివరించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేశారు.