కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన వాడపల్లి తేజ వెంకట మణిసాయి నుంచి... అక్రమంగా తరలిస్తున్న 48 మద్యం సీసాలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోడూరు నుంచి ద్విచక్ర వాహనంపై మద్యాన్ని తరలిస్తుండగా.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. మద్యం సీసాలను ఎక్కడ నుంచి కొనుగోలు చేశాడనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు అవనిగడ్డ సీఐ బీబీ రవికుమార్ వెల్లడించారు. నిందితుడిని పట్టుకున్న కోడూరు ఎస్సై రమేష్తో పాటు సిబ్బందిని సీఐ రవికుమార్ అభినందించారు.
అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ - కోడూరు అక్రమ మద్యం న్యూస్
కృష్ణా జిల్లా కోడూరు నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు నాగాయలంకకు చెందిన వాడపల్లి తేజ వెంకట మణిసాయిగా గుర్తించినట్లు తెలిపారు.
అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్