కృష్ణా జిల్లా తిరువూరు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ మీదుగా అక్రమ మద్యం రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్సైలు సుబ్రహ్మణ్యం, అవినాష్ తనిఖీ చేయగా తుళ్లూరు సుబ్బారావు, ఉండవల్లి సత్యనారాయణ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరినుంచి 276 మద్యం సీసాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మద్యం పట్టివేత - తిరువూరులో అక్రమ మద్యం తాజా వార్తలు
తిరువూరు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్సైలు సుబ్రహ్మణ్యం, అవినాష్ తనిఖీ చేయగా... అక్రమ మద్యం పట్టుబడింది. వారినుంచి మద్యం సీసాలు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
అక్రమ మద్యం పట్టివేత
వావిలాల చెక్ పోస్టు వద్ద అదే గ్రామానికి చెందిన మేకల రమేష్ మద్యం సీసాలు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇతని వద్ద నుంచి 154 మద్యం సీసాలు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు చెక్ పోస్టు వద్ద మొత్తం 421 సీసాల తెలంగాణ మద్యం పట్టుకున్నట్లు తెలిపారు. వీరు తెలంగాణ నుంచి మద్యం తీసుకువచ్చి ఆంధ్రాలో విక్రయిస్తున్నట్లు విలేకరులు సమావేశంలో డీఎస్పీ తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.