విజయవాడ నగరంలోని మసాజ్ సెంటర్లలో గుట్టుచప్పుడు కాకుండా అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.. మొగల్రాజపురంలో ఓ మసాజ్ పార్లర్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు పురుషులు, ఏడుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11 చరవాణులు , రూ.76 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మసాజ్ పార్లర్ మాటున అసాంఘీక కార్యకలాపాలు
విజయవాడ నగరంలోని మొగల్రాజపురంలో మసాజ్ పార్లర్ మాటున అసభ్య కార్యకలాపాలకు తెరలేపారు. యువతులకు మాయమాటలు చెప్పి బలవంతంగా పడుపు వృత్తిలో దింపుతున్నారు. ఆన్లైన్, చరవాణుల ద్వారా ప్రకటనలిస్తూ విటులను ఆకర్షిస్తూ అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ అంశంపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి.. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
మసాజ్ పార్లర్ మాటున అసాంఘీక కార్యకలాపాలు
యువతులకు మాయమాటలు చెప్పి వారితో అసభ్య కార్యకలాపాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. పార్లర్ నిర్వాహకురాలిపై 2018లో మాచవరం పోలీస్ స్టేషన్లో ఇదే తరహాలో కేసు నమోదైందని పోలీసులు గుర్తించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఇదీచదవండి.