భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. నూజివీడు మండలం కొత్త రావిచర్ల గ్రామానికి చెందిన భీమరాజు, రమాదేవి భార్యభర్తలు. మనస్పర్థల కారణంగా వీరు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. భార్యపై కోపం పెంచుకున్న భీమరాజు ఆమె చర్చికి వెళ్తుండగా దారికి అడ్డుపడి కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. దాడిలో ఆమె చేతివేళ్లు తెగిపోవటంతో బంధువులు ఆమెను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
దంపతుల మధ్య మనస్పర్థలు.. భార్యపై భర్త కత్తితో దాడి
కృష్ణా జిల్లా కొత్త రావిచర్ల దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది.
భార్యపై కత్తితో దాడి చేసిన భర