కృష్ణా జిల్లా అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయానికి ఆధార్ అనుసంధానం కోసం మహిళలు పోటెత్తారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు ప్రభుత్వం చేయూత పథకం ద్వారా రూ.18వేలు ఇస్తుంది. ఈ పథకానికి అర్హులైన వారు ఆధార్ అనుసంధానం కోసం అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయానికి రావాలని అధికారులు ప్రకటించారు. ఫలితంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న అర్హులందరూ ఒకేసారి రావడంతో గందరగోళం నెలకొంది. కనీస సౌకర్యాలు కల్పించకపోవటంతో కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. ఆయా మండలాల్లో ఆధార్ లింక్ చేసుకొనే వెసులుబాటు ఉన్నప్పటికీ మహిళలందరనీ అవనిగడ్డ రమ్మని చెప్పి ప్రభుత్వం తమ ప్రాణాలతో చెలగాటమాడుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో గందరగోళం - news updates in avanigadda
కృష్ణా జిల్లాలో అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో గందరగోళం నెలకొంది. ఆధార్ అనుసంధానం కోసం సమీప ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలతో కార్యాలయం కిక్కిరిసింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన లబ్ధిదారులు... ప్రభుత్వం తమ ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయంలో గందరగోళం