ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక, మద్యం అక్రమంగా తరలించకుండా... ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించనుంది. స్పెషల్ పోలీసు ఆఫీసర్ల నియామకానికి అర్హతలు ఖరారు చేస్తూ... హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ సైనికోద్యోగులు, రిటైర్డ్ పారామిలటరీ సిబ్బందికి అవకాశం కల్పించింది. మాజీ పోలీసు అధికారులు, మాజీ హోంగార్డులు, ప్రస్తుతం శిక్షణ పొందుతున్న హోంగార్డులకూ అవకాశం కల్పిస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది.
65 ఏళ్ల లోపు వయసు ఉండాలనే నిబంధన విధించింది.శారీర దార్ఢ్య పరీక్షల ద్వారా నియామకం చేపట్టనుంది. కానిస్టేబుల్ లేదా సమానమైన ర్యాంక్‌లో పనిచేసి ఉండాలని, క్రిమినల్ కేసులు లేకుండా కెరీర్లో శాఖాపరమైన చర్యలకు గురి కాకుండా ఉండాలన్న నిబంధనలను విధించింది. చెక్ పోస్టులు, మొబైల్ పార్టీల్లో ఉంటూ రెగ్యులర్ పోలీసులకు సాయం చేయాలని నిబంధన విధించింది. ముందుగా ఏడాది కాలానికి నియామకం చేపట్టి ఆ తర్వాత పనితీరును బట్టి రెన్యువల్ చేసే ఆలోచనలో ఉంది.