బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల జీవన స్థితిగతుల బాగుకోసం ప్రభుత్వం వివిధ పథకాలు కల్పిస్తున్నా.... కొందరు ఉద్యోగుల చర్యల వల్ల ఫలాలు అవసరం ఉన్న వారికి చేరడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫలితంగా పథకాల ప్రయోజనాలను పేదలు పొందలేకపోతున్నారని అభిప్రాయపడింది.
'వైఎస్సార్ చేయూత ఆర్థికసాయం తక్షణమే అందించండి' - వైఎస్సార్ చేయూత వార్తలు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల బాగుకోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కొందరు ఉద్యోగుల చర్యల వల్ల లబ్దిదారులకు అందడంలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. వైఎస్సార్ చేయూత పథకానికి అర్హులైనా తమకు ప్రయోజనాలు కల్పించడంలేదని 20 మంది మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారించిన కోర్టు పిటిషనర్లకు తక్షణమే ఆర్థికసాయం అందించాలని ఆదేశించింది.
High court
వైఎస్సార్ చేయూత పథకానికి అర్హులైనప్పటికీ తమకు ప్రయోజనాలు కల్పిండం లేదంటూ.... కృష్ణా జిల్లా చంద్రలపాడుకు చెందిన 20 మంది మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ వైఎస్సార్ చేయూత పథకం కింద పిటిషనర్లకు తక్షణం ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి :కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ పాఠశాలకు నూతన హంగులు