కృష్ణా జిల్లా మోపిదేవిలో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ముందు ఖాతాదారులు బారులు తీరారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో ప్రజలు రావటంతో స్వల్ప తోపులాట జరిగింది. బ్యాంకుల వద్ద శానిటైజేషన్ చేయలేదని ఖాతాదారులు వాపోయారు.
అక్కడికి వెళ్ళాలంటేనే భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అవనిగడ్డ సబ్ ఇన్స్పెక్టర్ సందీప్.. బ్యాంకు వద్దకు వెళ్లారు. అంతా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.