ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 20, 2020, 9:43 PM IST

ETV Bharat / state

కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు !

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు మరో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

heavy rains in next two days in the state
కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు !

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది. ఫలితంగా కోస్తాంధ్రలోని తూర్పుగోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు సహా రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిశాయి.

రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు ఉత్తర కోస్తాంధ్రలోని మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి...


నమోదైన వర్షపాతం సెంటిమీటర్లలో

బెలుగుప్ప (అనంతపురం) 4.7
మైలవరం (కడప ) 4.7
సూళ్లూరుపేట (నెల్లూరు) 4.5
లింగాల (కడప) 4.4
కోయిల్ కుంట్ల (కర్నూలు) 4.4

కదిరి (అనంతపురం) 3.5
రాచర్ల (ప్రకాశం) 3.2
ఆముదాలవలస (శ్రీకాకుళం) 3
తవనంపల్లె (చిత్తూరు) 2.5
ఐ.పోలవరం (తూ.గో) 2.5
ముమ్మిడివరం(తూ.గో) 2.0
ఓర్వకల్లు (కర్నూలు) 1.5
వాకాడు (నెల్లూరు) 1

ఇదీ చూడండి:

రాష్ట్రంలో వచ్చే నాలుగైదు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details