కృష్ణాజిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. విజయవాడతో పాటు ఇతర మండలాల్లోనూ కుండపోతగా వాన పడుతుండటంతో... నూజివీడు, మైలవరంలోని లోతట్టు ప్రాతాలు జలమయమయ్యాయి. మైలవరంలోని దేవుని చెరువు(తారకరామా నగర్) ప్రాంతంలో వర్షపు నీరు నివాసాలలో చేరింది. మైలవరం చుట్టు పక్కల పలు పల్లపు ప్రాంతాల పరిస్థితి ఇలానే ఉంది. జి.కొండూరు మండలం కుంటముక్కల క్రాస్ రోడ్ వద్ద కొండవాగు ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. విజయవాడకు వెళ్లే ప్రధాన మార్గమవడంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
కృష్ణా జిల్లాలో వర్షాలు... నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు - కృష్ణా జిల్లాలో వర్షాలు
కృష్ణా జిల్లాలో ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. విజయవాడతో పాటు ఇతర మండలాల్లోనూ కుండపోత వాన పడుతుండటంతో... నూజివీడు, మైలవరంలోని లోతట్టు జలమయమయ్యాయి.
కృష్ణా జిల్లాలో వర్షాలు