కృష్ణా జిల్లా గుడివాడలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. అల్పపీడన ప్రభావంతో రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలో పలుప్రాంతాలు నీటమునిగాయి.
గుడివాడలో భారీ వర్షం - కృష్ణాజిల్లా వార్తలు
మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో...కృష్ణా జిల్లా గుడివాడలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలో పలు ప్రాంతాలు నీట మునగటంతో పాటు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.
గుడివాడలో భారీ వర్షం
కొవిడ్ కారణంగా రైతు బజారును ఎన్టీఆర్ క్రీడా మైదానానికి మార్చారు. రాత్రి కురిసిన వర్షానికి మైదానమంతా నీటితో నిండిపోయింది. రైతు బజారును మైదానం వెలుపలికి తరలించటంతో...వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని ప్రధార రహదారులతో పాటు బస్ స్టాండ్ ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోయాయి. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి...ఇళ్లలోకి నీరు చేరింది.
ఇదీ చదవండి:అడుగుకో సర్పం.. అరచేతిలో ప్రాణం!