దివిసీమలో సోమవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో గాలి,వాన బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీయడంతో భారీ వృక్షాలు నేలకూలాయి. పలు చోట్ల చెట్లు కూలి, విద్యుత్ తీగలు తెగపడ్డాయి. గ్రామంలో ఒకచోట భారీ వృక్షం కూలి రెండు దుకాణాలు ధ్వంసమయ్యాయు. నాగాయలంక రహదారికి అడ్డంగా చెట్లు కూలిపోవటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ తీగలు తెగటం వలన విద్యుత్ సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. తెల్లవారు జామున ఈ సంఘటన జరగటంతో పెను ప్రమాదం తప్పింది.
దివిసీమలో వర్ష బీభత్సం... నేల కూలిన వృక్షాలు
కృష్ణా జిల్లా దివి సీమలో వాన, గాలి బీభత్సం సృష్టించింది.
దివిసీమలో వర్ష బీభత్సం